హిందువుల పండుగల పట్ల వివక్ష, అన్యుల పట్ల అపేక్ష..!
1 min read
హిందువుల పట్ల ఒక న్యాయం అన్యుల పట్ల మరో న్యాయం
కర్నూలు, న్యూస్ నేడు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, రేపు అంటే ఒకటి ఏప్రిల్ 25 నాడు ఈదుల్ ఫితర్ మరుసటి దినాన్ని కూడా సెలవు అంటే ఐచ్చిక సెలవును ప్రకటించడం ఎలా ఉందంటే హిందువుల పండగలకి ఎన్ని అభ్యర్థనలు చేసిన పట్టించుకోకుండా ముస్లింలకు తెలంగాణలో ఇచ్చారనే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డ్ అధికారులు ఇచ్చినటువంటి అభ్యర్థులతో ఆఘమేఘాల పైన రేపు రంజాన్ మరుసటి దినాన్ని ఐచ్చిక సెలవు ప్రకటించారు. ఇది హిందువుల పట్ల వివక్షత గానే తెలుస్తోంది. కొంతమంది డీఈవోలు పాఠశాల సెలవు దినాలు సరిపోలేదని ఆదివారాలు, పండగల్లో కూడా పని చేయమని ఒత్తిడి చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము అన్యమతస్తులు అంటే ముఖ్యంగా ముస్లింల ఒత్తిడికి లొంగి ఈ విధంగా ముందుగా ప్రకటించిన జనరల్ హాలిడేస్ లిస్ట్ లో లేని ఓహెచ్ ని ఇప్పటికిప్పుడు చేర్చి ఇవ్వడం ఎంతవరకు న్యాయమని హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ అధ్యక్షులు మహేష్ డేగల మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి కురువ చంద్రశేఖర్ ప్రశ్నిస్తున్నారు. వారికివ్వడం న్యాయం అయితే ఇదే విధానం హిందువుల ఇచ్చిక సెలవులకు కూడ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు ఏదైనా హిందువుల పట్ల వివక్షత మాత్రం సాధారణం, అన్ని ప్రభుత్వాలు హిందువులకు మోసం చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ఆదుకునే దానికి వ్యతిరేకంగా ఉంటాయని తెలియజేశారు, రాబోయే కాలంలో ఈ పద్ధతిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం.