NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చ‌ర్చ‌లు అసంపూర్ణం.. హామీల పై పట్టువీడ‌ని ఉద్యోగులు !

1 min read
ప‌ల్లెవెలుగువెబ్: పీఆర్సీ, ఇత‌ర డిమాండ్ల పై ఉద్యోగ సంఘాల‌తో ఆర్థిక మంత్రి రాజేంద్ర‌నాథ్ రెడ్డి, ప్ర‌భుత్వ స‌లహాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి నిర్వ‌హించిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం కాలేదు. ప్ర‌ధాన అంశ‌మైన ఫిట్ మెంట్ పై ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్ప‌ష్ట‌మైన హామీ ల‌భించ‌లేదు. బుధ‌వారం స‌చివాల‌యంలో ఐదున్న‌ర గంట‌ల పాటు చ‌ర్చ‌లు సుదీర్ఘంగా సాగాయి. మరోసారి చ‌ర్చ‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. పీఆర్సీ నివేదిక పై సీఎస్ క‌మిటీ సిఫార‌సులు ప‌క్క‌న పెడితే చ‌ర్చ‌లు సాగుతాయ‌ని ఉద్యోగులు స్ప‌ష్టం చేశారు. రెండు రోజుల పాటు చ‌ర్చ‌లు సాగినా ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్ప‌ష్ట‌మైన హామీ ల‌భించ‌లేద‌ని ఉద్యోగులు తెలిపారు. 
                               

About Author