దిశ మహిళా పోలీసు స్టేషన్ ఆకస్మిక తనిఖీ
1 min read– కర్నూలు జిల్లా ఎస్పీ.. దిశ పోలీస్ స్టేషన్ మహిళలకు అండగా నిలవాలి.
పల్లెవెలుగు,వెబ్ కర్నూలు: కర్నూలు దిశ మహిళా పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. దిశా పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసు కున్నారు. పలు సూచనలు, సలహాలు సిబ్బందికి తెలియచేశారు. అన్ని గ్రేవ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏయే కేసులు పెండింగ్ లో ఉన్నాయో , కోర్టు లో త్వరితగతిన ముద్దాయిలను హాజరు పరిచి, కోర్టు వారికి సహాకరించి, బాధితులకు న్యాయం జరిగే విధంగా చేయాలన్నారు. ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడారు. కేసుల తీవ్రతను బట్టి త్వరితగతిన పరిష్కారం జరిగేలా చూడాలన్నారు.బాధితులకు ఫ్యామిలి కౌన్సిలింగ్ చేయాలన్నారు. CYBER KAVACH …బాధిత మహిళలు దిశా పోలీసుస్టేషన్ కు వచ్చినప్పుడు వారికి CYBER KAVACH యొక్క ఉపయోగాలను తెలియజేయాలన్నారు. బాధిత మహిళల మొబైల్ ఫోన్ లను CYBER KAVACH తో స్కాన్ చేసుకోవాలని తెలియజేయాలన్నారు. ప్రత్యేకంగా మహిళలు CYBER KAVACH ను సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలన్నారు. ఈ CYBER KAVACH తో వారి మొబైల్ ఫోన్ లలో ఏలాంటి వైరస్ లు ఉన్నా , మాల్ వేర్లు ఉన్నా అటువంటి వాటిని వారి మొబైల్ ఫోన్ లలో లేకుండా చూడాలన్నారు. జిల్లా ఎస్పీ గారితో పాటు దిశా పోలీసు స్టేషన్ డిఎస్పీ వెంకటాద్రి, సిఐ కళా వెంకటరమణ, ఎస్సైలు ఉన్నారు.