PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాక్సిన్​ వేసుకోనందుకు…63 మంది వాలంటీర్ల తొలగింపు

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆత్మకూరు: కోవిడ్​ వ్యాక్సిన్​ వేసుకోనందుకు విధుల నుంచి తొలగించారు కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు. 63 మంది వార్డు వాలంటీర్లను విధుల నుండి తొలగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా టీకాలు వేసుకోకుండా పింఛనర్ల వద్దకు వెళ్లి కరోన వాహకాలుగా మారారని తెలిపారు. రెండు రోజుల క్రితం జాయింట్ కలెక్టర్ జిలాని ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా ఫోన్ ద్వారా హెచ్చరించినా వాలంటీర్లు స్పందించలేదని,అందుకే విధుల నుంచి తొలగించామని మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.

About Author