ఒక్క అంగన్ వాడీ ఉద్యోగినీ తొలగించం : సీఎం
1 min readపల్లెవెలుగు వెబ్: రాష్ట్రంలో ఒక్క అంగన్ వాడీ ఉద్యోగిని, అంగన్ వాడీ కేంద్రాన్ని మూసివేయడంలేదని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమలుకు కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నూతన విద్యావిధానం ద్వార విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందని సీఎం జగన్ అన్నారు. నూతన విద్యావిధానం ద్వార మండలానికి ఒకట్రెండు జూనియర్ కళాశాలలు ఉండేలా చూడాలని, ఆటస్థలం లేని పాఠశాలలకు ఆట స్థలం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి క్రీడా దుస్తులు, షూ ఇచ్చేందుకు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.