PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీసు (ఓపెన్ హౌస్) ఆయుధాల ప్రదర్శన

1 min read

కర్నూలు ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ జి. నాగబాబు, కర్నూలు పట్టణ డిఎస్పీ శ్రీ కెవి మహేష్
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసులు నిత్యం వినియోగించే ఆయుధాల ప్రదర్శన పై అవగాహన.పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా ప్రతీ ఏటా అమరవీరుల పోలీసులను స్మరించుకుంటూ నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలు ఎఆర్ అడిషనల్ ఎస్పీ జి. నాగబాబు, కర్నూలు పట్టణ డిఎస్పీ కెవి మహేష్ గారులు ప్రారంభించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో జిల్లా పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాలు, సాధనాలను ఒపెన్ హౌస్ కార్యక్రంలో భాగంగా ప్రదర్శనలో ఉంచారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమం ఈ రోజు, రేపు(గురువారం) ఒపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.పోలీసు వ్యవస్ధ పనితీరు గురించి , పోలీసులు తమ దైనందిన విధుల్లో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, పరికరాలు, సాధనాల గురించి కళాశాల, పాఠశాల విద్యార్దిని, విద్యార్దులు తెలుసుకోవాలన్నారు. విచ్చేసిన విద్యార్ధులకు ఆయుధాల గురించి ఎఆర్ డిఎస్పీ ఇలియాజ్ భాషా గారు, పోలీసు సిబ్బంది అవగాహన చేశారు.ఎలాంటి సందర్భంలో ఎలాంటి ఆయుధాన్ని వినియోగిస్తారు, వాటి పని తీరు గురించి అవగాహన కల్పించారు.
ప్రదర్శనలో ఉంచిన ఆయుధాలు…..22 రైఫిల్, 410 మస్కెట్ , 303 రైఫిల్ , 303 జి.ఎఫ్ రైఫిల్, .303 GF రైఫిల్ విత్ D.CUP, .303 LMG విత్ మ్యాగజైన్, 7.62MM బార్, 7.62MM SLR, 5.56 ఇన్సాస్ రైఫిల్ , ఎకె – 47 రైఫిల్, 9MM కార్బైన్, 9MM గ్లాక్ పిస్టల్, 9MM పిస్టల్, .380 రివాల్వర్, 12 బోర్ పంప్ యాక్షన్ గన్, 51MM మోర్టార్, యు.బి.జి.ఎల్, .303 RIOT తుపాకీ, 1.5″ ఫెడరల్ గ్యాస్ గన్, V.L పిస్టల్, టియర్ స్మోక్ షెల్స్, టియర్ స్మోక్ గ్రెనేడ్, ప్లాస్టిక్ పిల్లెట్ , కెన్ లాఠీ, ఫైబర్ లాఠీ, స్టోన్ గార్డ్ , బాడీ ప్రొటెక్టర్, బాడీ ప్రోటెక్టర్ , హెల్మెట్, B.P జాకెట్, గ్రౌండ్ షీట్లు, బాడీవోన్ కెమరాలు, డ్రోన్ కెమేరాలు, బాంబు డిస్పోజల్ టీం , విహెచ్ ఎఫ్ సెట్ మ్యాన్ ప్యాక్స్, బాంబ్ బ్లాంకెట్, వెహికల్ ఇన్ స్పెక్షన్ మిర్రర్ , ఎక్స్ టెన్సన్ మిర్రర్, ఎక్స్ ప్లోజివ్ డిటెక్టర్, రాకర్, డ్రాగన్ లైట్, డోర్ ప్రేమ్ మెటల్ డిటెక్టర్, ఫింగర్ ఫ్రింట్ పరికరాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు తదితర ఆయుధాలను ప్రదర్శనలో ఉంచారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐలు శివారెడ్డి, రమణ, సురేంద్రారెడ్డి, ఆర్ ఎస్సైలు, ఎఆర్, కమ్యూనికేషన్, ఫింగర్ ప్రింట్ పోలీసుసిబ్బంది, నారాయణ, శ్రీ లక్ష్మీ పాఠశాలల విద్యార్దులు పాల్గొన్నారు.

About Author