వైసిపి ప్రభుత్వంలో శాంతిభద్రతలకు విఘాతం..
1 min read– మండల ఐ టీడీపీ యమల మణికంఠ
పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: చెన్నూరు వైసీపీ ప్రభుత్వం లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, రాష్ట్రంలో అరాచక శక్తులకు అడ్డాగా మారిందని మండల ఐ టి డి పి ఛాంపియన్ యామాల మణికంఠ అన్నారు. ఈ సందర్భంగా ఆయన చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమని ఆయన తెలిపారు. అర్ధరాత్రి 12 ఎలాంటి నోటీసు ఇవ్వకుండా దౌర్జన్యంగా అరెస్టు చేయడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు, ప్రజాస్వామ్యంలో అందరికీ న్యాయం ఉంటుందని అధికార పక్షానికి ఒక న్యాయం, ప్రతిపక్షానికి ఒక న్యాయం ఉండదని ఆయన గుర్తు చేశారు, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వినప్పుడు, పోలీసులు వైసీపీ వాళ్లను ఎందుకు అరెస్టు చేసి జైలుకు పంపలేదో, పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు, వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న స్కాములు, మోసాలు తప్పులు ఎత్తి చూపిస్తే దాన్ని ఒక పెద్ద నేరంగా పరిగణించి, వైసిపి నాయకులు, పోలీసులను ఉసిగొలిపి టీడీపీ వాళ్లను అరెస్టులు చేసి ఇబ్బందులు పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు, ప్రజాస్వామ్యంలో ఎవరు తప్పు చేసినా దాన్ని విమర్శించడం, ప్రజలకు చెప్పడం తప్పు కాదన్నారు, వారి తప్పులను , మోసాలను ఎండగట్టారానే నెపంతో పోలీసుల చేత తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బందులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు, ఇలాంటి తరుణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు, పోలీసు శాఖతో సహా ప్రభుత్వ అధికారులను కోర్టు హెచ్చరించినప్పటికీ, వైసీపీ పాలనలో చలనం లేదని ఆయన తెలిపారు, రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, దౌర్జన్యా ల తో నిండి పోయిందని, వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునేలా పాలన సాగిస్తుందని ఆయన అన్నారు, ఇకనైనా శాంతిభద్రతలను కాపాడాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.