ఓటింగ్ కు దూరం.. తటస్థ వైఖరి ఎంచుకున్న భారత్ !
1 min readపల్లెవెలుగువెబ్ : రష్యా-ఉక్రెయిన్ అంశంలో భారత్ మరోసారి తటస్థ వైఖరినే ఎంచుకుంది. భద్రతామండలిలో, ఐరాస జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ కు గైర్హాజరైన భారత్ తాజాగా మరోసారి ఓటింగ్‌కు దూరంగా ఉంది. రష్యా సైనిక చర్య తర్వాత ఉక్రెయిన్‌లో మానవహక్కుల హననంతో పాటు సంబంధిత నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న ఆరోపణలపై ఓ అంతర్జాతీయ స్వతంత్ర విచారణ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలన్న అంశంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం ఓటింగ్ నిర్వహించింది. భారత్, చైనా, పాక్, సూడాన్, వెనిజులా సహా 13 దేశాలు ఓటింగ్‌కు దూ రంగా ఉండగా.. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, జపాన్, యూఏఈ, నేపాల్ సహా 32 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి.