ఉద్యోగులకు వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ !
1 min readపల్లెవెలుగువెబ్ : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి విరుద్దంగా ప్రభుత్వం నడుస్తోందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు విమర్శించారు. ఉద్యోగులు రాజ్యాంగంలో భాగమేనని.. వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు. పీడీఎఫ్ తరపున ఉద్యోగ సంఘాలకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. అశుతోష్ మిశ్రా నివేదికను బహిర్గతం చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయకుండా ఫిట్ మెంట్ ప్రకటించడం చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఉద్యోగులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందన్నారు. వాలంటీర్ల ద్వార ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు.