PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదలకు బట్టలు పంపిణీ చేయడం అభినందనీయం…

1 min read

పల్లెవెలుగు వెబ్: పేదలకు బట్టలు పంపిణీ చేయడం అభినందనీయమని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా శుక్రవారం రాయచోటి పట్టణంలోని షాహీ షాదీ ఖానా పంక్షన్ హాల్ లో బేపారి బషీర్ ఖాన్ గారి తనయుడు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ బేపారి మహమ్మద్ ఖాన్  అద్వర్యంలో  మూడు వేల మంది పేదలకు బట్టలు  పంపిణీ కార్యక్రమానికి   శాసన మండలి  డిప్యూటీ చైర్మన్ జకీయా ఖానం మరియు గడికోట  శ్రీకాంత్ రెడ్డిముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ  పవిత్రమైన రంజాన్ మాసపు పురస్కరించుకుని పేదలకు బట్టలు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు.ఈద్గా అభివృద్ధిలో  బేపారి బషీర్ ఖాన్ సేవలు ప్రశంసనీయమన్నారు. బేపారి బషీర్ ఖాన్,బేపారి మహమ్మద్ ఖాన్ లు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం, ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీధర్ ,మున్సిపల్ వైస్ చెర్మన్ ఫయాజుర్ రెహమాన్, కొలిమి ఛాన్ బాష, అన్న సలీం, గౌస్ ఖాన్, ఈశ్వర్ ప్రసాద్, సుగవాసి శామ్, బేపారి జబీవుల్లా,  పట్టణ యువజన అద్యేక్షులు మొగల్ నాదర్ బేగ్,  విక్కీ, బేపారి అసద్, ఇంతియస్,  పార్టీ కార్యకర్తలు, తదితరులు  పాల్గొన్నారు

About Author