NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విభిన్న ప్రతిభావంతులకు సహాయ ఉపకరణాలు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నగరంలోని స్థానిక బి. క్యాంపు నందు మన వృద్ధుల ఆశ్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆర్థిక సహాయంతో (సి ఎస్ ఆర్ ఫండ్ ), అలింకో మరియు సహాయ సంచాలకులు వికలాంగుల సంక్షేమ శాఖ కర్నూలు వారి ఆధ్వర్యంలో బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్, వినికిడి యంత్రాలు, కృత్రిమ కాలు, చేతి కర్రలు, వీల్ చైర్స్ మొదలగు 109 మంది లబ్దిదారులకు రూ.21.55 లక్షలు విలువగల పరికరములు జాయింట్ కలెక్టర్ శ్రీమతి. నారపురెడ్డి మౌర్య ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో (ఐఓసీల్ ) ఈ.డి. డి.ఎస్. రావ్, సి.జి.ఎం. డి. పి. శతపతి, జనరల్ మేనేజర్ జి.వి. సత్యనారాయణ, అలింకో పి.ఓ. ఆఫీసర్ రవిశంకర్, అసిస్టెంట్ డైరెక్టర్ డిజెబుల్డ్ వెల్ఫేర్ శ్రీమతి రాయిస్ ఫాతిమా, మన వృద్ధాశ్రమ నిర్వాహకులు శ్రీ. ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

About Author