27న భారత్ బంద్… కరపత్రాలు పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ఈ నెల 27న చేపట్టే భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు సీపీఎం జిల్లా నాయకులు. శనివారం భారత్ బంద్‌కు మద్దతు కోరుతూ వ్యాపార సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. నగరంలోని మండి బజార్ ప్రాంతంనుండి పూలబజార్, వన్ టౌన్ , చిత్తారి గేరి నాలుగు రస్తాలు ,చిన్న మార్కెట్, పింజరీ గెరి వరకు జరిగిన ప్రచార కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ముహమ్మద్ షరీఫ్, అబ్దుల్ దేశాయ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గౌస్ బాషా బాలముని,రాజు, బొట్టు స్వామి, రామకృష్ణ ,విజయ్, దామోదర్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు.