NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిరస్రాయులకు దుప్పట్ల పంపిణీ..

1 min read

55 మంది రోడ్ల పక్కన నిదురించే వారికి అందజేత

చైర్మన్ బివి కృష్ణారెడ్డి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : శీతాకాలం కారణంగా ఏలూరులోని  చలికి ఇబ్బంది పడుతున్న  రోడ్డు ప్రక్కల యాచకులకు, నిరాశ్రయులకు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి మరియు మేనేజింగ్ కమిటీ మెంబర్లు  బుధవారం రాత్రి దుప్పట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ శీతాకాలం కారణంగా ప్రస్తుతం రోజురోజుకి చలి ఎక్కువవుతున్నందున  రోడ్లు ప్రక్కల, ఫుట్ పాత్ ల మీద, దేవాలయాల దగ్గర పడుకునే నిరాశ్రయులకు, యాచకులకు రెడ్ క్రాస్ సొసైటీ తరఫున దుప్పట్లను పంచే కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 55 మందికి దుప్పట్లను పంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి కేబీ సీతారాం, ట్రెజరర్ రేవూరి శివప్రసాద్, రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు బి ఆర్ సి హెచ్ నారాయణ, కే.సత్యనారాయణ, రెడ్ క్రాస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author