NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

100 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ..

1 min read

– నిరస్రాయులకు సహాయ సహకారాలు అందించాలి..
ట్రస్ట్ చైర్మన్ మారుమూడు థామస్

పల్లెవెలుగు వెబ్ చింతలపూడి : ఏలూరు జిల్లా : చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో ఈ రోజు రాజీవ్ థామస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మారుమూడి థామస్ ఆర్థిక సహాయంతో చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం ఆధ్వర్యంలో 100 మంది వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ టీడీపీ నాయకులు మారుమూడి థామస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమకు ఉన్న దానిలోనే పేదవారికి,అనాధలకు, దిక్కులేని వారికి సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని, అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అంది ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని,కాబట్టి ప్రతి ఒక్కరు 2024లో చంద్రబాబునాయుడు ని ముఖ్యమంత్రి చేయాలని అన్నారు, ఈ కార్యక్రమంలో ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్, రాష్ట్ర మహిళా అంగన్వాడీ కార్యదర్శి ముళ్లగిరి సుందరమ్మ,మాజీ మండల ప్రధాన కార్యదర్శి ధారా వీరేంద్ర,గడిదేసి ఏసు,వెలగపల్లి కీర్తి,గన్నమనేని వాసు, రావెళ్ల హనుమంతరావు, టోకూరిఏబు,మద్దా ఆనంద్, ముళ్ళగిరి అచ్చియ్య, భాస్కరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author