PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హర్ సెల్ఫ్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: హర్షల్ప్ ఆధ్వర్యంలో మహానంది సమీపంలోని చెంచులక్ష్మి గూడెంలో దుప్పట్లను పంపిణీ చేశారు. డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ జనార్ధన్ శెట్టి హర్షల్ప్ సభ్యులు చెంచులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ నిరక్షరాశులయిన గిరిజనులు వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా స్వచ్ఛంద సంస్థ అయిన హర్ సెల్ఫ్ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తాసిల్దార్ జనార్ధన్ శెట్టి మాట్లాడుతూ చెంచు కుటుంబాలకు ఏ ఆపద వచ్చినా అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.. ప్రభుత్వం తరుపున రావలసిన అన్ని సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.

About Author