లయన్స్ క్లబ్ అఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ
1 min read
పల్లెవెలుగు వెబ్, రాయచోటి: లయన్స్ క్లబ్ అఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో టీవీఎస్ ట్రావెల్స్ అధినేత హైదర్ అలీ గారి మరియు మాస్ యూట్యూబ్ ఛానల్ మస్తాన్ సహకారంతోబుధవారం రాయఛోటిలోని వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి ఎదురుగా నివసిస్తున్న పేదలకు బట్టలు పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు అధ్యక్షులు లయన్ చాన్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా లయన్ చాన్ బాషా మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో టీవీఎస్ ట్రావెల్స్ అధినేత హైదర్ ఆలీ మరియు మాస్ యూట్యూబ్ ఛానల్ మస్తాన్ ముందుకొచ్చి బట్టలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రతీ ఒక్కరూ తమ వంతుగా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజా సేవలో ఉండాలని తెలిపారు. అనంతరం దాతలు హైదర్ అలీ మస్తాన్ మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేసే అవకాశం కలగడం చాలా అదృష్టం అని భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ వారిచే నిర్వహించడానికి మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు .ఈ కార్యక్రమములో మాజీ అధ్యక్షులు లయన్ సుబ్బా రెడ్డి,ఉపాధ్యక్షులు లయన్ హరీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.