జగనన్న గోరుముద్దలో రాగి జావా పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు జగనన్న గోరుముద్దలో భాగంగా “రాగి జావా” పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు రాగిపిండి, బెల్లంపొడితో తయారుచేసిన నాణ్యమైన ” రాగిజావా “పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టారని జడ్పీటిసి కలిమున్నిసా బేగం, సర్పంచి మరియమ్మ అన్నారు. మంగళవారం నందికొట్కూరు మండలం లోని బ్రాహ్మణ కొట్కూరు జడ్పీ పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్ పుల్లన్న ఆధ్వర్యంలో ప్రభుత్వం జగనన్న గోరు ముద్ద పథకం లో భాగంగా విద్యార్థులకు రాగి జావా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జడ్పీటిసి, సర్పంచి ముఖ్య అతిధులు గా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించగా విద్యార్థిని విద్యార్థులు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని తెలియడంతో పిల్లలలో రక్తహీనత సమస్యలు నివారించడానికి మంగళ, గురు,శనివారాల్లో “రాగిజావా” సోమ,బుధ, శుక్రవారాల్లో వేరుశనగ, బెల్లంతో తయారుచేసిన “చెక్కిలు” అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయి తిమ్మయ్య ,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.