NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ప్రేమాలయం’కు రాగిమాల్టు, మాస్కులు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: కడప జిల్లా రాయచోటిలోని బండపల్లి ప్రేమాలయం ఆశ్రమంలో లయన్స్ క్లబ్ అఫ్ రాయచోటి టౌన్ మరియు గుడ్ నైబర్స్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 50 కేజీలు రాగి మాల్ట్,మాస్కులు మరియు శానిటైజర్లు పంపిణీ చేశారు. గుడ్ నైబర్స్ ఇండియా ఆర్గనైజేషన్ నిర్వాహకులు నాగేశ్వర్ సహాయంతో రాగిమాల్టు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ చాన్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా గుడ్ నైబర్స్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు నాగేశ్వర్ మాట్లాడుతూ ఇక్కడున్న పెద్దలకు సేవ చేసే అవకాశం కలగడం చాలా సంతోషకరం గా ఉందన్నారు. భవిష్యత్తులో లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ వారిచే సంయుక్తంగా కలిసి ప్రజలకు ఉపయోగపడే మరెన్నో సేవా కార్యక్రమాలను గుడ్ నైబర్స్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రేమాలయం ఆశ్రమం మేనేజర్ కృష్ణ , వెంకట సుబ్బయ్య, ఉపాధ్యక్షులు లయన్ సుందర్ రాజా నాయుడు,లయన్ వెంకట్రామి రెడ్డి,వృద్ధులు మరియు ఆశ్రమం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author