నులిపురుగుల నివారణ మందులు పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చిన్నపిల్లలకు నులిపురుగుల నిర్మూలన ఎంతైనా అవసరమని చెన్నూరు తూర్పు హరిజన వాడ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసులు అన్నారు, జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకొని శుక్రవారం పాఠశాలలో ఆశా వర్కర్ అనసూయ విద్యార్థులకు నులిపురుగుల మందులు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, రక్తహీనత, పోషకాహార లోపం ఆకలి మందగించడం, నీరసం, ఆందోళన, కడుపునొప్పి, వికారం, వాంతులు, వీరేచనాలు బరువు తగ్గడం తదితర లక్షణాలు ఉన్నవారిలో నులిపురుగులు ఉంటాయని 1- నుండి19 ఏళ్ల బాల బాలి బాలికలు, యువతి యువకుల్లో నులిపురుగులను నివారించడానికి శుక్రవారం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నులిపురుగుల మందులను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు, నులిపురుగుల మందులు వాడడం వల్ల పిల్లలకు ఎంతో మంచిదని ప్రతి ఒక్కరు నులిపురుగుల మందును తప్పకుండా వేసుకోవాలని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.