PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాలీబాల్​ క్రీడాకారులకు..,డ్రెస్ కిట్లు పంపిణీ

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి:అన్నమయ్య జిల్లా కేంద్రమయిన రాయచోటిలో ఆదివారం  వాలిబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా శిబిరంలోని విద్యార్థులకు  సర్టిఫికెట్స్ మరియు  డ్రెస్ కిట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనారిటీ నాయకులు హాబీబుల్లాఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతివిద్యార్థి చదువుకోవడం తోపాటు క్రీడల్లో ప్రతిభ చూపి తల్లిదండ్రులకు జిల్లాకు, రాష్ట్రానికి పేరుప్రతిష్టలు  తేవాలన్నారు. కోచింగ్ క్యాంప్ లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 7:00 వరకు బాల బాలికలకు .ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఇందులో ఆసక్తిగల విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. సంప్రదించవలసిన ఫోన్ (నెంబర్ 8639358797 ). ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి అయినటువంటి కె హబీబుల్లాఖాన్   తన సొంత వ్యయంతో పిల్లలకు ఈ డ్రెస్ కిట్లు మరియు ఇవ్వడం జరిగింది.తర్వాత పిల్లలకు మరియు తల్లిదండ్రులకు ప్రేరణత్మక ప్రసంగం ఇవ్వడం జరిగింది.ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో రాయచోటి వాలీబాల్ సంఘ ప్రతినిధులు హరి కిషోర్ గారు ,మహమ్మద్ అలీ మరియు కోచ్  గౌస్ గారు క్రీడాకారులు ,తల్లిదండ్రులుతదితరులు  పాల్గొన్నారు.

About Author