ఇళ్ళు కాలిన బాధితులకు నిత్యవసర వస్తువులు పంపిణీ
1 min readనిర్విరామంగా కొనసాగుతున్న సొసైటీ సేవా కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: గత వారంలో స్థానిక ఇశ్రాయేలు పేటలో షార్క్ సర్క్యూట్ తో రెండు పూరి ఇళ్ళు కాలి అగ్రికి ఆహుతయ్యాయి. రెండు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. ఆ కుటుంబాల వారికి గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు, సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఇరు కుటుంబాల మహిళలకు నిత్యవసర వస్తువులు, బియ్యం, చీరలు సొసైటీ అధ్యక్షుడు సొంగ మధు, కార్యదర్శి యర్రా జయదాస్, సభ్యులు బుధవారం పంపిణీ చేశారు. సొసైటీ స్థాపించిన నాటినుండి నేటి వరకు దాతల సహకారంతో సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. తమకున్న దానిలో కొంతైనా సేవ చేసేవారికి దాతలు అందించటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది కలపాల రవి, కడిమి యోహాను,పెన్యాల జ్యోతి,కత్తి బాజీ,కోలా ఐజక్ పాల్గొన్నారు.