విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : స్థానిక కస్తూరిబా బాలికలవిద్యాలయంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దాత అయినటువంటి మాదాసి మాదారి కురువ సంఘం మండల అధ్యక్షులు కె.పంపాపతి పదవ తరగతి విద్యార్థులకు 400 పరీక్ష ప్యాడ్ లను ముఖ్య అతిథిగా జడ్పీజిల్లా వైస్ చైర్మన్ భావ కె.శేషాప్పా So దివ్య భారతి చేతుల మీదగా విద్యార్థులకు అందజేయడం జరిగింది..మాదాసి మాదారి కురువ సంఘం తాలూకా ప్రధాన కార్యదర్శి మల్లయ్య. ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులకు వారి భవిష్యత్తులో ఇది మొదటి మెట్టు ఈ మొదటి మెట్లో ఏ విదంగా అయితే మంచి ఉత్తీర్ణత శాతం సాధిస్తామో భాష్యత్తులో కూడా మంచి ఉన్నత విద్యాను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగి తమ తల్లిదండ్రులకు గ్రామానికి పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని కోరారు. అదేవిదంగా పరీక్షల సమయంలో ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా వచ్చిన సమాధానాలను వచ్చినట్టు ముందుగా రాయాలని తెలియజేశారు. అదేవిదంగా అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కావున ఆరోగ్యం పరంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో కురువ గదిలింగా ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.