NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రంగస్థల కళాకారులకు కంటి అద్దాలు మందులు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు నగరం నందలి పింగళి సూరన్న తోటలో ఈరోజు ఉదయం 11 గంటలకు సీనియర్ రంగస్థల కళాకారులు మేకప్ మెన్ శివన్న మేకప్ మ్యాన్ రాముడు కళాకారుడు అక్బర్ బాషా కు కంటి అద్దములు ఆరోగ్య మాత్రలు మందులు కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జి అంకయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సహాయ సహకార కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యక్షులు డి దస్తగిరి ప్రధాన కార్యదర్శి పి హనుమంతరావు చౌదరి కార్యనిర్వాహక కార్యదర్శి బైలుప్పల షఫీయుల్లా కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారులకు జీవిత ప్రమాద బీమా సౌకర్యం దాతల సహకారంతో నిర్వహిస్తామని కావున రంగస్థల కళాకారులు దీనిని ఉపయోగించుకోవాలని రంగస్థల కళాకారులకు తెలియ చేశారు. ఈ సహాయ సహకార కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు డి పుల్లయ్య డి ఎన్ వి సుబ్బయ్య కళాప్రియ తిరుపాలు ఎం చాంద్ పాషా మధురకవి ఎలమర్తి రమణయ్య గాండ్లలక్ష్మన్న పీజీ వెంకటేశ్వర్లు సి చెన్నకృష్ణ మనోహర్ బాబు సిబి అజయ్ కుమార్ సయ్యద్ రోషనలి ఆనందరావు అరుణ నాగేశ్వరరావు కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం సభ్యుల సమక్షంలో రంగస్థల కళాకారులకు కంటి అద్దాల పంపిణీ మరియు ఆరోగ్య మందులు అందజేయడం జరిగింది. రంగస్థల కళాకారుల సహకారంతో సాయి లీలలు నాటకాన్ని ప్రారంభించాలని భవిష్యత్తులో ప్రదర్శన ఇవ్వాలని రంగస్థల కళాకారులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.

About Author