పండుగలా పెన్షన్ల పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రతి నెలా 1వ తేదీన తెల్లవారు జామునే లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేస్తోందన్నారు. కర్నూలు జిల్లాలోని వివిధ రకాల 4,47,873 మంది పెన్షన్ దారులకు మంగళవారం మధ్యాహ్నం 03:00 గంటలకు 3,78,141 మందికి 84.43 శాతం పింఛన్లు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లాలోని వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది…. సంక్షేమ ఫలాలు ఇంటికే అందిస్తున్న జగనన్న ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు.