కర్ఫ్యూ ముగిసే వరకు… ఆహార పొట్లాల పంపిణీ
1 min read– రాజస్థాన్ సేవా సమితి అధ్యక్షులు హనుమాన్ సింగ్
పల్లెవెలుగు వెబ్, మక్తల్: కరోన కష్టకాలంలో .. కర్ఫ్యూ ముగిసే వరకు అనాథలకు, కోవిడ్ రోగులకు ఆహారపొట్లాలు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేస్తామన్నారు రాజస్థాన్ సేవా సమితి అధ్యక్షులు హనుమాన్ సింగ్. మంగళవారం మక్తల్ ఆస్పత్రిలోని కోవిడ్ రోగులకు, అనాథలకు ఆహారపొట్లాలు, వాటర్ బాటిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా హనుమాన్ సింగ్ మాట్లాడుతూ సేవా సమితి నేతృత్వంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రస్తుతం కరోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. కర్ఫ్యూ ఉన్నంత వరకు.. ప్రతి రోజు ఆహారపొట్లాలు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా హనుమాన్ సింగ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు థాన్ సింగ్, ట్రెజరరీ సర్వన్ దాస్, సభ్యులు జై సింగ్, రమేశ్, విక్రమ్ సింగ్, సోన్ సింగ్, బేరారామ్, నైనారామ్, జటూసింగ్, రాజారామ్, ఇతర రాజస్తాన్ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.