పట్టణ కుష్టు వ్యాధి గ్రస్తులకు పాదరక్షలు పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కల్లూరు,కర్నూలు పట్టణ కుష్టు వ్యాధి గ్రస్తులకు ఎం సి ఆర్ (మైక్రో సెల్యూలర్ రబ్బర్ ) పాదరక్షలు బుధవారం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా వైద్య శాఖధికారి బి.రామగిడ్డయ్య మాట్లాడుతూ…కుష్టు వ్యాధి గ్రస్తులకు కాళ్లకు స్పర్శ లేకపోవడం వల్ల మేకులు, రాళ్లు సూదులు గుచ్చుకుని పుండ్లుగా మారుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. కావున వీరికి రక్షణ కల్పించేందుకు పాదరక్షలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు.సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర నాధ్ రెడ్డి మాట్లాడుతూ వ్యాధి సోకిన వారు అంగవైకల్యం నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ దేవసాగర్ మాట్లాడుతూ చేతులు, కాళ్ళు నీటిలో నానబెట్టుకోవడం,గరుకు రాతితో రుద్దడం,డ్రస్సింగ్ గురించి వివరించారు.పి. టి. మనోహర్ మాట్లాడుతూ లెఫ్రా ఇండియా సోసైటీ వారి ఎం సి ఆర్ తయారీ సేవలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎం.ఓ.డాక్టర్ శారద,ఫిజియోథెరఫీస్ట్ మనోహర్ రెడ్డి బాబు,హెచ్ ఈ ఓ శివశంకర,పిఎంఓ విజయ్ కుమార్,డిపిఎంఓలు సుబ్రహ్మణ్యం,రాజు,వార్డ్ సిబ్బంది, పాల్గొన్నారు.