1 నుంచి ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ
1 min read– కలెక్టర్ సి. హరికిరణ్
పల్లెవెలుగు వెబ్, కడప బ్యూరో: భావితరాల బంగారు భవిష్యత్తుకు ఫోర్టిఫైడ్ బియ్యంను జూన్ 1వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ , జేసీ ( రెవిన్యూ) గౌతమి సంయుక్తంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన “భావితరాల బంగారు భవిష్యత్తుకు ఫోర్టిఫైడ్ బియ్యం.. సూక్ష్మపోషకాల ఉపయోగం” ..అనే ప్రచార పోస్టర్ల ను తన ఛాంబర్లో జేసీలు ఎం.గౌతమి, సి.ఎం.సాయికాంత్వర్మ లతో కలసి జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వార మద్యాహ్న భోజన పథకం మరియు మాతా శిశు సంక్షేమ శాఖ వారి పథకములకు జూన్ -2021 నుండి ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తామన్నారు.
బాలలకు పౌష్టికాహారం..
ప్రస్తుత గణాంకాల ప్రకారం , మద్యాహ్న బోజన పథకం క్రింద 2565 ప్రైమరీ విద్యాలయాలకు సంబంధించి 1,36,725 మంది పిల్లలు మరియు 391 అప్పర్ ప్రైమరీ విద్యాలయాలకు సంబంధించి 66,593 మంది పిల్లలకు , 3621 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి 40 వేల మంది గర్భిని స్త్రీలకు మరియు 90 వేల మంది బాలలకు పౌష్టికాహార లోపాన్ని సరిదిద్దుటకు ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేయబడుతుందని పేర్కొన్నారు. దీనికి సంబందించిన మద్యాహ్న బోజన పథకం మరియు మాతా శిశు సంక్షేమ పథకములకు ఈ క్రింది విదముగా కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి సౌభాగ్య లక్ష్మి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివ పార్వతి, సమాచార శాఖ ఏడి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.