PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాలుగో విడత వైయస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గడివేముల మండల కేంద్రంలోని స్థానిక పొదుపు మహిళా సమాఖ్య కేంద్రం అవరణం లో వైయస్సార్ ఆసరా పథకం నాలుగవ విడత కార్యక్రమాన్ని బుధవారం నాడు శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి బుధవారం నాడు ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పొదుపు మహిళా సంఘాల సభ్యులకు  చెక్కును అందజేశారు ఎమ్మెల్యే  మాట్లాడుతూ మండలంలో మొత్తం 597 సంఘాలకు గాను నాలుగో విడతగా 2 కోట్ల 12 లక్షల రూపాయలు విడుదల చేశారని, మండలంలో నాలుగు విడతలకు గాను మొత్తం 8 కోట్ల 48 లక్షలు మంజూరయ్యాయని అన్నారు. నాడు 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో మహిళలకు పొదుపు రుణాలు మాఫీ చేస్తానని ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసి  దశలవారీగా మహిళా పొదుపు రుణాల ను తీర్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళలు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లక్ష్యంతోనే జగనన్న వైయస్సార్ ఆసరా పథకం ద్వారా పొదుపు రుణాలను నాలుగు దశలవారీగా పూర్తిగా రుణమాఫీ చేశారన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అన్నింటిలో కూడా 98% మేరా నెరవేర్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు మాట మోసం చేశారని 2014 సంవత్సరంలో టిడిపి ప్రభుత్వం రాకముందు ఎన్నికలలో రైతు రుణాలు మాఫీ చేస్తారని నమ్మించి టిడిపి ప్రభుత్వం అధికారంలో రాగానే చెప్పిన హామీలను నెరవేర్చకుండా రైతులకు ప్రజలకు మోసం చేశారని గుర్తు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాలు వర్షాలు బాగా కురిసాయని, ఈ సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ యాత్రల వల్ల వర్షాలు కురవడం లేదని అన్నారు. మాట ఇచ్చి మాట మీద నిలబడే నాయకుని గుర్తించాలని, వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా పేరు తెచ్చుకోవడం జరిగిందని జగనన్న ప్రవేశపెట్టిన పథకాలలో ఎక్కువ భాగం మహిళలకు మాత్రమే కేటాయించడం దీనికి నిదర్శనం అని తెలిపారు. నిత్యం ప్రజల కోసం పరితపించే నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరడం జరుగుతుందని కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని మళ్లీ ముఖ్యమంత్రిగా అఖండ మెజార్టీతో గెలిపించాలని మహిళలకు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి  పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఆర్.బి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ నాగమద్దమ్మ, వెలుగు ఏపీఎం  హజరత్ ఉస్మాన్, పొదుపు లక్ష్మి జిల్లా సెక్రటరీ అనురాధ, డి ఆర్ డి ఎ పి డి శ్రీధర్ రెడ్డి, ఎంపీడీవో శివరామిరెడ్డి,డిప్యూటీ తాసిల్దార్ గురునాథం, వైయస్సార్ పార్టీ నాయకులు గని ఉపసర్పంచ్ ఆనంద రెడ్డి, మేఘనాథ్ రెడ్డి ,అనిల్ కుమార్ రెడ్డి, గడివేముల ఎంపీటీసీ మహేశ్వరరెడ్డి, దేశం నాగేశ్వర్ రెడ్డి, పెసరవెయ్ శ్రీకాంత్ రెడ్డి, సిరుప శ్రీనివాస్ రెడ్డి, గని ప్రతాప్ రెడ్డి, దుర్వేసి బండపల్లి రమేష్, వెంకటకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author