అందుల పాఠశాలలో ఉచితంగా దుప్పట్లు పంపిణీ…
1 min read – నక్కలమిట్ట శ్రీనివాసులు
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: నగర శివారులోని పసపుల గ్రామ లో గల అందుల పాఠశాలలో, పెద్ద పాడు లోని ప్రభుత్వ వసతి గృహం విద్యార్థులకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు ,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళ కార్యదర్శి శకుంతల, శనివారం సాయంత్రం రూప ఇండస్ట్రీస్ వారి సహకారంతో విద్యార్థులకుదుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలికాలం దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు దోమలనుండి వారు క్షేమంగా ఉండేందుకు ఎంతో ఉపయోగపడతాయని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు దుప్పట్లు వెంటనే పంపిణీ చేయాలని వారు కోరారు అదేవిధంగా సమాజంలో మేధావులు ఇండస్ట్రీ సంభదిచిన వ్యాపారవేత్తలు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని వారు కోరారు ప్రాజెక్టు డైరెక్టర్ కుమారి గారుమాట్లాడుతూ పిల్లలకు ఈ చలికాలం లొ దుప్పట్లు ఇవ్వడం చాలా సంతోషం అన్నారు.ఈరోజు ఈసేవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారి సిబ్బంది విజయ,జాతీయ బీసీ సంక్షేమ సంగం హైకోర్టు లాయర్ రామాంజనేయులు రాష్ట్ర కార్యదర్శి ఆన్వార్ హుస్సేన్, సమాజ సేవకుడు ప్రముఖ న్యాయవాది కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.