పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలు పంపిణీ
1 min read
పల్లెవెలుగు ,కర్నూలు: పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమములో భాగంగా 14-02-2025 వ తేదిన పాణ్యం నియోజవర్గము లోని కల్లూరు మండలం పెద్దపాడు ఎ.పి. మోడల్ స్కూల్ నందు పంపిణీ కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమం లో పెద్దపాదు గ్రామంలో దృష్టిలోపము ఉన్న 46 మంది విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలు పాణ్యం నియోజక వర్గము శాసన సభ్యురాలు శ్రీమతి గౌరు చరితారెడ్డి ద్వారా పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీమతి డాక్టర్ పి. శాంతి కళ , జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి శ్రీమతి డాక్టర్ ఎం. సంద్యా రెడ్డి , డిప్యూటీ మేయర్ శ్రీమతి రేణుక రెడ్డి , పాఠశాల ప్రిన్సిపల్ ఈరన్న రావు , పాఠశాల కమిటే అద్యక్షులు మధు నరసింహం 36వ వార్డ్ నాయకులు తిరుమలేస్వర్ రెడ్డి పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు . కర్నూలు జిల్లాలో 1.26,412 మంది విద్యార్థులకు వంటి పరీక్షలు నిర్వహించగా, 3700 మంది విద్యార్థులకు దృష్టి లోపము ఉన్నట్లు గుర్తించి, ఉచిత కంటి అద్దాలు పంపిణి కార్యక్రమము చేపడుసున్నట్లు జిల్లా అంధత్వ నివారణ అధికారి శ్రీమతి డా.ఎం. సంధ్యారెడ్డి తెలిపారు.