గర్భిణీలకు ఉచిత భోజనం పంపిణీ
1 min readపల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం.అవుకు మండలంలోని అవుకు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల జరుగు ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ కార్యక్రమము.9.11.2022 వ తేదీన జరిగినది. ఈ కార్యక్రమంలో 79 మంది గర్భవతులను పరీక్షించి వారికి అవసరం ఉన్న రక్త పరీక్షలు, మందులు మరియు స్కానింగ్ చేయడం జరిగినది .ఇందులో 16 మందిని అధిక ప్రమాదకర గర్భవతులుగా గుర్తించి వారిలో ఒకరిని మాత్రమే హయ్యర్ ప్రభుత్వ హాస్పిటల్స్ కి రెఫర్ చేయడం జరిగినది. గర్భవతులకు గర్భస్థ మరియు ప్రసవం తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలపై డాక్టర్ యమున వైద్యాధికారిణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉప్పలపాడు, డాక్టర్ ఏ .సుష్మ గైనకాలజిస్ట్ సామాజిక ఆరోగ్య కేంద్రం అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి వినోద్ కుమార్ వైద్యాధికారి ఉప్పలపాడు మరియు వారి సిబ్బంది సహకారం చే గర్భవతులకు ఉచిత మధ్యాహ్న భోజనము సరఫరా చేయడం జరిగినది. హెల్త్ సూపర్వైజర్ కే.కమాల్ సాహెబ్ ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ , PMMVY, జననీ సురక్ష యోజన 104 102 108 తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ఆరోగ్య శ్రీ లో ఉచితప్రస్తావాలు గురించి వివరించినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యమునా వైద్యాధికారిణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉప్పలపాడు, డాక్టర్ పి రవికుమార్ డీ డీ ఓ డాక్టర్ ఏ సుష్మ గైనకాలజిస్ట్, డాక్టర్ పి రవికుమార్ దంత వైద్య నిపుణులు, మల్లేశ్వరి పీహెచ్ఎన్, కే కమాల్ సాహెబ్, వేణుగోపాల రాజు ,దానమ్మ, తెరిసమ్మ హెల్త్ సూపర్వైజర్లు, సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవుకు సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.