శ్రీశైలం కాలినడకన వెళ్లే కర్ణాటక భక్తులకు మంచినీళ్ల ప్యాకెట్స్ పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులతో కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయ కమిటీ వారి ఆధ్వర్యంలో వేసవి దాహార్తి తీర్చే కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు నందికొట్కూరు రోడ్డులోని పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర శ్రీశైలము కాలినడకన వెళ్లే కర్ణాటక మహారాష్ట్ర భక్తులకు ఈరోజు ఉదయం 7 గంటల నుండి పులిహార మరియు చల్లని మంచినీళ్ల ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగినది మధ్యాహ్నం 12 గంటలకి భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగినది మరియు మంచినీటి ప్యాకెట్స్ పంపిణీ సాయంత్రం వరకు జరిగినది ఈ కార్యక్రమంలో అనేక వేల మంది భక్తులు దాహార్తిని తీర్చుకొని అన్నప్రసాదం స్వీకరించి శ్రీశైలంనకు బయలుదేరి వెళ్ళినారు కర్ణాటక మహారాష్ట్ర భక్తులు ఎంత దూరం నుంచి ఎంత ప్రయాసతో శ్రీశైలం నడుచుకుంటూ వెళ్తున్న వారికి మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పులిహోర ప్రసాద ధాతగా చెన్న నాగమహేంద్ర యామిని దంపతులు సహకరించినారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ టి ఎస్ రామకృష్ణ డాక్టర్ నగేష్ శ్రీదేవి వాలంటరీ రాఘవేంద్ర శర్మ మరియు దేవాలయ స్టాప్ రామమహేశ్వరప్ప ధనుంజయ్ నాగరాజు మహేందర్ మద్దిలేటి వీరమ్మ చిన్మయి మాధవి ఎల్లమ్మ వీరందరూ పాల్గొని ఈ కార్యక్రమమును విజయవంతం చేసినారు.