NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సామాజిక ఆరోగ్య కేంద్రానికి- హెచ్పీసీఎల్ సామాగ్రి వితరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్( విజయవాడ- ధర్మపురి) బూస్టర్ స్టేషన్ టీమ్ టి, ఓబయ్య చీఫ్ స్టేషన్ మేనేజర్, అలాగే నాగార్జున రావు సీనియర్ మేనేజర్ ఆపరేషన్ వారు 12 లక్షల 50వేల రూపాయల విలువ కలిగిన సామాగ్రిని వితరణ చేసినట్లు, సామాజిక ఆరోగ్య కేంద్ర డాక్టర్లు, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ దినకర్ రెడ్డి లు తెలిపారు, బుధవారం సాయంత్రం వారు విలేకరులతో మాట్లాడుతూ, చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అలాగే ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన సామాగ్రి అవసరమని భావించి, వెంటనే తాము ఇద్దరం హెచ్పిసిఎల్ వారిని కలవడం జరిగింది అన్నారు, ఆసుపత్రికి సంబంధించిన కొంత సామాగ్రిని మీరు డొనేట్ చేయాల్సిందిగా అడగడంతో వారు వెంటనే మంచి సహృదయంతో స్పందించి ఆసుపత్రికి సంబంధించిన ఐసీయూ బెడ్లు-5, అలాగే వీల్ చైర్స్-5, ఇన్సు ట్ర మెంట్ ట్రాలీ లు-10 ఈసీజీ పరికరాలు-2 డెలివరీ బెడ్-1 ఎల్ఈడి ఓటి లైట్-1 ఇవ్వడం జరిగిందని తెలిపారు, ఇవన్నీ కూడా బుధవారం సాయంత్రం వారు ఆసుపత్రికి వచ్చే ప్రజలకు అంకితం చేయడం జరిగిందన్నారు, మేము అడగగానే తక్షణ సహాయం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని వారన్నారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ సాగరకుమారి, డాక్టర్ రామ్మూర్తి నాయక్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్( హెచ్పీసీఎల్) టీమ్ పాల్గొనడం జరిగింది.

About Author