PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నులిపురుగుల నివారణ మందులు పంపిణీ

1 min read
నులిపురుగుల మందులు ఇస్తున్న వైద్య సిబ్బంది

నులిపురుగుల మందులు ఇస్తున్న వైద్య సిబ్బంది

పల్లెవెలుగు వెబ్​, చాగలమర్రి: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందులు పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు . చాగలమర్రి లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, మండలంలోని నేలంపాడు , చింతలచెరువు , పెద్దవంగలి , చింతలచెరువు , మద్దూరు గ్రామాల్లోని పాఠశాలల్లో వైద్యసిబ్బంది విద్యార్థులకు నులిపురుగుల నివారణ  మందులను పంపిణీ చేయడం జరిగిందని హెల్త్‌ ఎడ్యుకేటర్‌  వెంకటమ్మ తెలియజేశారు . జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు మందులను పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు.

About Author