PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రుణాల పంపిణీ..లక్ష్యం చేరుకోవాలి

1 min read
జూమ్ కాన్ఫరెన్స్​లో మాట్లాడుతున్న కలెక్టర్​ జి. వీరపాండియన్​

జూమ్ కాన్ఫరెన్స్​లో మాట్లాడుతున్న కలెక్టర్​ జి. వీరపాండియన్​

వ్యవసాయం, వ్యవసాయాధారిత రంగాలకు విరివిగా రుణాలు ఇవ్వండి
– 2021-2022 వార్షిక ప్రణాళిక టార్గెట్ 17257.00 కోట్లు
– డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమీక్ష సమావేశంలో బ్యాంకర్లకు సూచించిన జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు బ్యూరో: పంట రుణాలు విరివిగా ఇచ్చి రైతులను ఆదుకోవాలని కలెక్టర్‌ జి వీరపాండియన్‌ బ్యాంకర్లను ఆదేశించారు.
శనివారం స్థానిక కలెక్టరేట్ కలెక్టర్ వారి కార్యాలయం నుండి డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమీక్షలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు సబ్సిడీ రుణాల పై బ్యాంకర్లు మరియు అధికారులతో కలెక్టర్ జి వీరపాండియన్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్, ఆర్ బి ఐ హైదరాబాద్ ఏ జి ఎం జి. చంద్రకాంత్, నాబార్డు ఏజీఎం పార్థసారథి, ఎల్‌డీఎం వెంకట నారాయణ, డిఆర్డీఏ ఏపీడి శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జోనల్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ జెడి డాక్టర్. రమణయ్య, చేనేత మరియు జౌళి శాఖ ఏడి వెంకటేశ్వర్లు, అగ్రికల్చర్ జెడి ఉమామహేశ్వరమ్మ, ఈ డి మైనార్టీ కార్పొరేషన్ పర్వీన్ భాను, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చంద్రశేఖర్, సోషల్ వెల్ఫేర్ డిడి రమాదేవి, డి టి డబ్ల్యూ రమాదేవి, జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ వ్యవసాయం, వ్యవసాయాధారిత రంగాలకు సకాలంలో రుణాలిచ్చి ప్రోత్సహించాలని బ్యాంకర్లకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రుణాలను వెంటనే ఇవ్వాలని సూచించారు. జిల్లాలో రుణాల పంపిణీ లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. పొదుపు మహిళలకు జీవనోపాధి రుణాలు కూడా సకాలంలో అందేలా చూడాలన్నారు.
2021-2022 వార్షిక ప్రణాళిక టార్గెట్ 17,257.00 కోట్లు
క్రాప్ ప్రొడక్షన్ టార్గెట్ 8287.00 కోట్ల రూపాయలు, ఖరీఫ్ సీజన్ సంబంధించి 5460.00 కోట్లు, రబీ సీజన్ 2827.00 కోట్లు, టర్మ్ లోన్స్ 1975.00 కోట్లు, అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 210.00 కోట్లు, ఫుడ్ ఆగ్రో ప్రాసెసింగ్ 136.00 కోట్లు, వ్యవసాయ రంగానికి సంబంధించి లక్ష్యం రూ. 10608 కోట్లు, ఎంఎస్ఎంఈ 1940.00 కోట్లు, ఎక్స్పోర్ట్ క్రెడిట్ 4.00 కోట్లు, అధర్ ప్రియరిటీ సేక్టర్ 964.00 కోట్లు, టోటల్ ప్రియరిటీ సేక్టర్ 13516.00 కోట్లు, నాన్ ప్రియరిటీ సేక్టర్ 3741.00 కోట్లు, వార్షిక ప్రణాళిక టార్గెట్ 17,257.00 కోట్లు రూపాయలు కేటాయించారు.

About Author