విద్యార్థులకు మోడల్ టెస్ట్ పేపర్స్ పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని కొండపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు పి.వి.ఎస్ నారాయణ సోమవారం వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థము మోడల్ టెస్ట్ పేపర్లు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తను కూడా పదవ తరగతి వరకు కొండపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న( పూర్వపు విద్యార్థి) నని తను చదివిన పాఠశాలకు ఏదైనా చేయాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పదవ తరగతి చదివే విద్యార్థులందరికీ మోడల్ టెస్ట్ పేపర్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు, విద్యార్థులు ఇప్పుడు కష్టపడి చదువు కోవడం వల్ల వారి తల రాతలు మారిపోతాయని, తర్వాత ఆ కుటుంబాలు కూడా ఎంతో ఉన్నత స్థాయికి రావడం జరుగుతుందని ఆయన తెలిపారు, ఉదాహరణకు తానేనని ఆయన తెలియజేశారు, గతంలో ఉన్న చదువుకు ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉన్నదని, ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడం జరిగిందని, విద్యార్థులకు ఏ లోటు లేకుండా అన్ని వసతులతో పాటు డబ్బులు కూడా ప్రతి సంవత్సరం వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు, ఉచిత పుస్తకాలు, ఉచిత నోట్ బుక్స్, యూనిఫామ్స్, షూస్, ఇలా అనేక రకాల వసతులు కల్పించడం జరిగిందన్నారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో విద్యకు అత్యున్నత స్థానాన్ని కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు, విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని ఆయన ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.