NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అవోపా ఆధ్వర్యంలో దోమ తెర‌లు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, క‌ర్నూలు: అమరజీవి పొట్టి శ్రీరాములు 122వ జయంతి పురస్కరించుకొని  అవోపా ఆధ్వర్యంలో స్థానిక పూల బజార్ నందు గల పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల కృతులను జేసీ ఘనంగా నివాళులు అర్పించడం అయినది. అనంతరం అవోపా అధ్యక్షులు గోనూరు యుగంధర్ శెట్టి మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఒక దాత అందించిన 60 దోమతెరలను మన వృద్ధుల ఆశ్రమానికి 20, కీర్తన అనాధ శరణాలయానికి 20, జీ.నారాయణమ్మ మానసిక వికలాంగుల కేంద్రంనకు 20 అందించడ మైనది. నేటి కరోనా రోజుల్లో  ఇతర అంటు రోగాలకు గురి కాకుండా  ఒక దాత అందజేసిన ఈ దోమతెరలు మాకు ఎంతో ఉపయోగకరమని ల‌బ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కార్యదర్శి టీవీ రత్న ప్రసాద్ మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ సుజాత కార్యదర్శి పోలేపల్లి శేషయ్య వధూవరుల పరిచయ వేదిక చైర్మన్ జవహర్ బాబు, పి.ఆర్, ఓ.అవినాష్ శెట్టి, సభ్యులు నాగేళ్ల హరికిషన్ చిన్ని నరసింహులు విష్ణువర్ధన్ కిరణ్, శశిధర్ ఆంధ్ర బ్యాంక్ రిటైడ్ ఎంప్లాయ్ ప్రభాకర్ గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author