విద్యార్థులకు నులి పురుగుల మందు పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా చెన్నూరు తూర్పు హరిజనవాడ లోని ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు నులి పురుగుల మందు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ నులి పురుగుల వల్ల చిన్నారుల్లో రక్తహీనత ఏర్పడి, ఆకలి మందగించడం బరువు తగ్గడం జరుగుతుందన్నారు, దీనివల్ల విద్యార్థులు బలహీనంగా మారడం, జరుగుతుందని ఆయన అన్నారు, దీనికి నివారణ గా విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్లు ఆశా వర్కర్లు, మహిళా పోలీసులు కలసి వేయడం జరిగిందని ఆయన తెలిపారు, విద్యార్థులు ఆహారం తీసుకునేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుని ఆహారం తీసుకోవాలని తెలియజేశారు, అదేవిధంగా వ్యక్తిగత శుభ్రత కూడా ఎంతో అవసరమని, వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఎలాంటి జబ్బులు దరిచేరవని ఆయన తెలియజేశారు, అనంతరం విద్యార్థులందరికీ కూడా నులి పురుగుల మందు ను వేయించడం జరిగిందని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్, కే ,అనసూయ, మహిళా పోలీస్ పాల్గొన్నారు.