PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HIV బాధితులకు పౌష్టికాహారం దుప్పట్లు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: రాయచోటి పరిసర ప్రాంతాల్లో ఉన్నH I V బాధితులకు లయన్స్ క్లబ్ రాయచోటి మరియు దాతల సహకారంతో వై ఆర్ జి కేర్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పౌష్టికాహారం మరియు దుప్పట్లు పంపిణీ చేశారు. క్లబ్​ వ్యవస్థాపక అధ్యక్షుడు హరినాథరెడ్డి మాట్లాడుతూ h i v బాధితులు మనోధైర్యం తో ఉండాలన్నారు. అదేవిధంగా సమయానికి మందులు వాడటం వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు మరియు స్థానిక ప్రజలు అండగా నిలవాలన్నారు. ప్రతి నెలా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. y r g సంస్థ కో ఆర్డినేటర్ శ్రీనివాసులు మాట్లాడుతూ మానసిక ప్రశాంతతతొ వ్యాయామం చేస్తూ తమ జీవిత కాలాన్ని పెంచుకోవడానికి వీలుంటుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్, భాస్కర్ రెడ్డి, p c జగదీష్, చైల్డ్ ఫుడ్ డి అర్ పి అల్లావలి, బాధితుల సంరక్షకులు తదితరులు పాల్గొన్నారు.

About Author