రేషన్ షాపు ద్వార పెట్రోల్, డీజిల్ పంపిణీ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఇంధన కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. పెట్రోల్, డీజిల్ కోసం పెట్రోల్ పంపుల ముందు రోజుల తరబడి నిలుచోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ‘నేషనల్ ఇంధన పాస్’ పేరుతో ఇంధన రేషన్ పథకాన్ని శనివారం ప్రవేశపెట్టారు ఆ దేశ విద్యుత్తు, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేకర. ఈ కొత్త పాస్ ద్వారా వారం పద్ధతిలో ఇంధన కోటాను కేటాయిస్తారు. వాహన నంబర్, ఇతర వివరాలను ధ్రువీకరించి నేషనల్ ఐడెండిటీ కార్డు అందిస్తారు. దానికి క్యూఆర్ కోడ్‌లు కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్ వాహన యజమానులు తమ రిజిస్ట్రేషన్ నంబర్‌లోని చివరి అంకె ద్వారా తమ వంతు ఎప్పుడు వస్తుందని తెలుసుకోవచ్చు.