PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మొక్కలు పంపిణీ

1 min read

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మొక్కలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం అభినందనీయమని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న శ్రీ గురుదత్త పాలి క్లినిక్ లో కల్లూరు ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే బాషా ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మకు మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ మాట్లాడుతూ కల్లూరు ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ తరపున మొక్కలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం అభినందనీయమని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని చెప్పారు. మొక్కలు నాటడం వల్ల అవి కార్బన్డయాక్సైడ్ ను పీల్చుకొని మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్ను అందజేస్తున్నాయని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. విచ్చలవిడిగా మొక్కలు నరికి వేయడం వల్ల పర్యావరణముకు నష్టం వాటిల్లి ఓజోన్ పొర దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని చెప్పారు. నాటిన మొక్కలు చెట్లుగా పెరగడం వల్ల అందమైన ప్రకృతితో పాటు మానవాళి మనుగడకు అవసరమైన ఆక్సిజన్ అందిస్తాయని చెప్పారు .నూతన సంవత్సరం సందర్భంగా వృధా ఖర్చులు మానుకొని ఇలా మొక్కలు ఇచ్చే సమాజానికి పర్యావరణ పరిరక్షణపై మంచి సందేశం ఇస్తున్నారని అభినందించారు. ప్రతి ఒక్కరూ నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలని అప్పుడే పర్యావరణ పరిరక్షణకు పాటుపడినట్లు అవుతుందన్నారు. చెట్లను నరికి వేయడం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోయి పలు రకాల వ్యాధులకు గురవుతున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎస్కే బాషా, చాంద్ భాష, మద్దిలేటి ,భాస్కర్, ఎల్లగౌడ్, రామకృష్ణ ,సత్య ,చౌదరి తదితరులు పాల్గొన్నారు.

About Author