రంజాన్ తోఫా పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్, చిట్వేల్: పవిత్ర రంజాన్ పండగను ప్రతి ముస్లిం సోదరులు సంతోషంగా.. సమానంగా జరుపుకోవాలని చిట్వేల్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఖదీర్ బాషా ఆకాంక్షించారు. సోమవారం పేద ముస్లిం కుటుంబాలకు చెందిన 70 మందికి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. నిరుపేదల ముస్లిం కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 కేజీల సన్నబియ్యం, కేజీ కందిపపప్పు, కేజీ గోధుమ పిండి, కేజీ సెమియా, కేజీ చక్కెర, లీటరు వంటనూనెతోపాటు రూ. 300 నగదును కరోనా నిబంధనలను పాటిస్తూ అందజేశామన్నారు. ఈ సందర్భంగా షేక్ ఖదీర్ బాష మాట్లాడుతూ రంజాన్ పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. స్థానిక ముస్లింలతోపాటు కువైట్ ప్రవాస ముస్లింలు, యువకులు తోఫా పంపిణీకి ఆర్థిక సాయం అందించడం అభినందనీయమన్నారు. అనంతరం సొసైటీ ఉపాధ్యక్షులు ఎస్ఎస్ షఫీ , కార్యదర్శి షేక్ జిలాని బాష మాట్లాడారు. కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి షేక్.ఇంతియాజ్ అహ్మద్, కోశాధికారి జి.ఎస్.అల్లభక్ష్, సభ్యులు అంజాద్ భాషా, ఖాలేశా, మస్తాన్, షబ్బీర్, రియాజ్ ఖాన్, సానవాజ్,ముస్లింపెద్దలు, యువకులు పాల్గొన్నారు.