PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ

1 min read

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా  పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా అందించిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శేఖర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న గురుదత్త పాలి క్లినిక్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు ఎంతో దీక్షతో ఉపవాస దీక్షలు చేపడతారని ఆయన వివరించారు. పవిత్ర రంజాన్ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో పేద ముస్లిం మహిళలకు తన వంతు బాధ్యతగా రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసినట్లు వివరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఒక వయసు దాటిన తర్వాత సామాజిక సేవ భావాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సేవ చేయాలన్న సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన కోరుతూ తనవంతు బాధ్యతగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం వేసవి మండుటెండలు అధికంగా ఉండటం వల్ల వేసవి మండుటెండల కు గురి కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నీటిని అధికంగా తీసుకోవాలని లేదంటే నీటి శాతం తగ్గిపోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వివరించారు. అలాగే పరిశుభ్రమైన నీటిని తాగడం మర్చిపోరాదని, కలుషితమైన నీటిని తాగితే టైఫాయిడ్, జాండీస్, కలరా ,విరోచనాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు .ముస్లిం సోదరులందరికీ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శుభాకాంక్షలు సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక నగర అధ్యక్షురాలు సుమలత తదితరులు పాల్గొన్నారు.

About Author