NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యువగళం పాదయాత్రలో నడవడం కోసం షూస్ పంపిణీ

1 min read

నారా లోకేష్ నందికొట్కూరు  పాదయాత్ర లో వాలంటీర్లకు బూట్లు పంపిణి చేసిన తిలక్ గట్టు:

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గంలో యువగళం వాలంటీర్లకు , రోప్ టీమ్ సభ్యులకు, యువగళం సభ్యులకు అందరికి పాదయాత్రలో నడవడం కోసం షూస్ పంపిణీ చేసిన ఐటీడీపీ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు తిలక్ గట్టు గారు ఎండా , వాన లో  ఎల్లపుడు లోకేష్ గారి పాదయాత్రలో ఎల్లప్పుడు యువగళం  వాలంటీర్ సభ్యులు కష్ట పడుతున్నారని ఎన్నో వందల కిలోమీటర్లు నడుస్తూ పార్టీ కోసం ఎంతో కష్టపడుతూ పని చేస్తున్నారని వాళ్ళ కోసం అందుకే ఐటీడీపీ తరపున వారికీ బూట్లు పంపిణి చేయడం ఎంతో సంతోషంగా ఉందని తిలక్ గట్టు తెలియచేసారు.ఈ కార్యక్రమంలో TNSF రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారు , తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు గారు పాల్గొని సభ్యులందరికి యువగళం క్యాంపు నందు పంపిణి చేసారు. వీరితో పాటు బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజు యాదవ్ , తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి జూటూరు రవి ,TNSF  కర్నూల్ సిటీ ఉపాధ్యక్షులు రంజిత్ , దినేష్ పాల్గొన్నారు.

About Author