PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా చీఫ్ కోచ్ షెఫీ ఆధ్వర్యంలో క్రీడా పరికరాలు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో మంగళవారం జిల్లా చీఫ్ కోచ్ షెఫీ ఆధ్వర్యంలో క్రీడా పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పరిధిలోని మదనపల్లి మండలానికి చెందిన ఫుట్బాల్ కోచ్ మహేంద్రకు  ఫుట్బాల్ క్రీడా పరికరాలు అందజేసినట్లు తెలిపారు. మదనపల్లి లోని శ్రీ వేదా పాఠశాలలో పి ఈ టి గా పని చేస్తున్న మహేంద్ర  గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. అదేవిధంగా జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులకు తగిన జాగ్రత్తలు మెలుకువలు నేర్పి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు మండల స్థాయి కోచ్ లు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

About Author