PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సండే స్కూల్ పిల్లలకి స్పోర్ట్స్ కిట్లు పంపిణీ

1 min read

– వైసీపీ నాయకులు ఆర్టీసీ బాబు  చేతుల మీదుగా కిట్స్ పంపిణీ.

– మారుతీ నగర్ ఎబినేజర్ చర్చిలో అట్టహాసంగా బాబు  జన్మదిన వేడుకలు.

పల్లెవెలుగు వెబ్  నందికొట్కూరు:  నందికొట్కూరు నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లలకు స్పోర్ట్స్ కిట్లు ఎబినేజర్ చర్చి ఆధ్వర్యంలో  ఆర్టీసీ బాబు  చేతుల మీదుగా పంపిణీ చేశారు.బుధవారం వైసీపీ నాయకులు బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  సండే స్కూల్ లో ఉన్నటువంటి పిల్లలు శారీరకంగా ఎదిగి మంచి భవిష్యత్తును స్పోర్ట్స్ ద్వారా సంపాదించుకోవాలని అందుకు అనుకూలంగా ఉన్నటువంటి స్పోర్ట్స్ వస్తువులను పిల్లలకి అందించడం హర్షణీయమని ఆర్టిసి బాబు  అన్నారు . ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్న ఎబినేజర్ చర్చి పాస్టర్ బ్రదర్ జాకోబ్ ను సంఘ పెద్దలను ఆయన ప్రశంసించారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి  అభిమానులుగా ఇటువంటి సేవా కార్యక్రమంలో మేము ఎప్పుడూ ముందుంటామని ఆయన చెప్పారు.అనంతరం జన్మదిన వేడుకల్లో భాగంగా పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో బాబు  మిత్రులు మరియు శ్రేయోభిలాషులు అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లాలు ప్రసాద్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్   ఉస్మాన్ భాష, మారుతి నగర్ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, ముచ్చుమర్రి భాష, సోషల్ మీడియా చరణ్, మైనార్టీ నాయకులు సలాం బాషా, జవ్వాజి సుంకన్న గౌడు సేవా సమితి అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ , ఆర్ట్ శీను  , బజాజ్ షోరూం రంగస్వామి, ధనుంజయ నాయుడు , కుమార్ , చర్చి సంఘా పెద్దలు నాగాశేషులు,  సండే స్కూల్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author