మానవత సేవా సంస్థ కు టాటా ఏసీ వాహనం వితరణ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి తన తల్లిగారైన గుమ్మ సుబ్బమ్మ జ్ఞాపకార్థం ప్రజల అవసరార్థం మానవతా సేవా సంస్థకు మంగళవారం టాటా ఏసి వాహనాన్ని ఉచితంగా ఇవ్వడం జరిగింధని ఉప్పరపల్లి ఎంపీటీసీ ఎర్ర సాని నిరంజన్ రెడ్డి తెలిపారు, మంగళవారం అయిన చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, సేవా గుణం, మంచి మనసు గల గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, (తన సొంత నిధులతో) 3 లక్షల50 వేల రూపాయలు తో టాటా ఏసి వాహనాన్ని కొనుగోలు చేసి మానవతా సేవా సంస్థకు ఇవ్వడం జరిగిందన్నారు, ఈ వాహనం ద్వారా మండలంలో ఎక్కడైనా బాడీ ఫ్రీజర్ అవసరమైనట్లయితే అక్కడికి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని తెలిపారు, అంతేకాకుండా ఆయన వద్దకు మండల ప్రజలు, ఎవరైనా ఆపద లో ఉన్నారంటే వారికి అందుబాటులో ఉండడమే కాకుండా వారికి తక్షణ సహాయం అందజేయడం జరుగుతుందన్నారు, అలాగే ఆయన ఎన్నో ప్రజాప్రయోజకరమైన పనులు చేయడం ఏ కాకుండా మండల ప్రజల మన్ననలు పొందడం జరిగిందన్నారు, ఇలా అన్ని విధాలుగా తన సహాయ సహకారాలు అందించడంతో మానవతా సేవా సంస్థ, మండల ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు.