వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్లు పంపిణీ..
1 min read– ముఖ్యమంత్రి అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకొని బాలింతలు, గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలి..
– మేయర్ షేక్ నూర్జహాన్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : గర్భిణీలు, బాలింతల ఆరోగ్యం, పౌష్టికాహారం అందించే విషయంలో ప్రభుత్వం ఎక్కడ రాజీ పడే ప్రసక్తేలేదని, అందులో భాగంగా వారి ఇంటికే పౌష్టికాహార కిట్లను పంపిణీ చేయడం జరుగుతుందని నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. శనివారం స్థానిక నగరపాలకసంస్థ కార్యాలయంలోని పాత కౌన్సిల్ హాల్లో మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ కార్యక్రమంలో మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్ని, బాలింతలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గం పరిధిలో 205 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణీ స్త్రీలు1608 మంది, బాలింతలు 1222 మంది ఉన్నారని, వీరందరికీ వైయస్సార్ సంపూర్ణ పోషణ మరియు వైఎస్సార్ కిట్లు ద్వారా బియ్యం,కందిపప్పు వంటనూనె, కోడి గుడ్లు,5 లీటర్ల పాలు, రాగి పిండి, అటుకులు, బెల్లం, వేరుశెనగ చిక్కి, ఎండు ఖర్జూరం మొదలగు రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని, గర్భిణీ స్త్రీలు బాలింతలు ఆరోగ్యంగా ఉండాలని ఒక్క రోజు కూడా లేట్ చేయకుండా ప్రతి నెల మొదటి, మూడో శుక్రవారం రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పేదల సైతం ఆరోగ్యంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి నాణ్యమైన సరుకులను అందిస్తున్నారని,అదేవిధంగా 3 నుండి 6 సంవత్సరాల బాలలకు మధ్యాహ్నం భోజనం పథకం ద్వారా మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణీలు బాలింతలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. మూడు సంవత్సరాల నుండి మీ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించి వారికి మంచి విద్యావంతులను చేయాలని ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులను ఆమె కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ ను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి కె. పద్మావతి,ఇన్చార్జి సిడిపిఓ ఏ.లలిత, డిప్యూటీ మేయర్ నూక పెయ్యి సుధీర్ బాబు, కార్పొరేటర్లు జిజ్జువరపు విజయనిర్మల, ఈదుపల్లి కళ్యాణి, సబ్బన శ్రీనివాస్, ఆరేపల్లి రాధిక సత్తిబాబు, కో-ఆప్షన్ సభ్యురాలు నీత విజయ్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు.