వైయస్సార్ చేయూత చెక్కుల పంపిణీ..
1 min read-పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి.
పల్లెవెలుగు వెబ్ గడివేముల : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే… కుటుంబం ఆర్థికంగా బలపడుతుందని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. మహిళల అభ్యన్నతిని దృష్టిలో ఉంచుకుని.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు రూపొందించారన్నారు. మంగళవారం నాడు గడివేముల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నాలుగవ విడత వైయస్సార్ చేయూత చెక్కు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, జడ్పిటిసి ఆర్ .బి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 5 కోట్ల 16 లక్షల చేయూత చెక్కును మహిళలకు అందించారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మహిళలకు వైయస్సార్ చేయూత కింద ప్రభుత్వం 18,750 అందిస్తుందని, మహిళల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రజలకు జగనన్న అమ్మఒడి, వైయస్సార్ ఆరోగ్యశ్రీ, వైయస్సార్ పెన్షన్ కానుక ,వైయస్సార్ కాపు నేస్తం, పేదలకు ఇల్లు, జగనన్న చేదోడు, జగనన్న చేయూత, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైయస్సార్ చేయూత, రైతు భరోసా లాంటి పథకాలు అమలు చేసి పేదలకు చేయూత ఇస్తున్నారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తి నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే తగ్గుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అభివృద్ధి చేయకపోగా, వైసిపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ఏదో రకంగా అడ్డుకుంటున్నారని, అన్నారు. సంక్షేమ పథకాలు రావాలంటే మళ్ళీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. మార్క్ ఫెడ్ చైర్మన్ తో మాట్లాడి మండలంలో మహేంద్ర రకం జొన్నలను కచ్చితంగా కొనుగోలు చేయించి రైతులకు న్యాయం చేస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గతంలో కంటే భారీ మెజార్టీతో ఈసారి గెలిపించాలని కోరారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ శివరామిరెడ్డి, పొదుపు లక్ష్మి సెక్రెటరీ అనురాధ, ఉప సర్పంచ్ బాలచెన్ని, వైసిపి నాయకులు పోగుల చంద్రశేఖర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శిరుప శ్రీనివాస్ రెడ్డి, నంద్యాల వెంకటేశ్వర్లు, దేశం సంజీవరెడ్డి, దుర్వేసి బండపల్లి రమేష్, ఈఓఆర్డి కాలిక్ భాషా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.