NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధ్యాయులకు… విద్యార్థులకు వితరణ

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి : రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1981-83 సంవత్సరాల మధ్య ఇంటర్మీడియట్ విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు 80 మంది ప్రైవేటుపాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రెండు లక్షల విలువచేసే నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శనివారం ఉదయం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ రాంబాబు హాజరయ్యారు . ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కొండూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ కరోనా కాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు మానవతా దృక్పథంతో ఆదుకోవడానికి ముందుకొచ్చిన సాగర మిత్రబృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రాంబాబు మాట్లాడుతూ 30 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఐక్యమత్యంతో పూర్వ విద్యార్థులు కలిసి సాయం చేయడం అభినందనీయమన్నారు . వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరి కొంత మంది ముందుకు రావాలని కోరారు . కార్యక్రమంలో లైన్ నాగేశ్వరరావు, రామాంజనేయులు సదాశివ రెడ్డి బాలరాజు, లక్ష్మీ రమణయ్య, నాసర్ తదితరులు పాల్గొన్నారు.

About Author